క్రైమ్ కంట్రోలింగ్ లో….దేశానికే తెలంగాణ పోలీస్ ఆదర్శం : డీజీపీ

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేస్తున్నామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. క్రైమ్ కంట్రోలింగ్ లో దేశానికే తెలంగాణ పోలీస్ ఆదర్శమన్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని.. నేర నియంత్రణకు ఉపయోగిస్తున్నామన్నారు పోలీస్ బాస్. రాష్ట్రంలో ఎవరు నేరం చేసినా పోలీసులకు దొరికిపోతామన్న భయం పుట్టించగలిగామన్నారు. వరుసగా చేధిస్తున్న కేసులతో జనంలోనూ భద్రతాభావం పెరిగిందన్నారు డీజీపీ. టీ కాప్ ను విడుదల చేసిన డీజీపీ.. దాన్ని సామాన్య ప్రజలు ఎలా వాడుకోవాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

 

Posted in Uncategorized

Latest Updates