క్లీన్ అండ్ గ్రీన్ : ఎయిర్ పోర్ట్ తరహాలో మెట్రో స్టేషన్లు

మెట్రో ప్రాజెక్ట్ లో  వరల్డ్ క్లాస్  ఫెసిలిటీస్ తో పాటు..  గ్రీనరీ పెంచుతూ  కొత్త లుక్  క్రియేట్ చేస్తున్నారు.  ఎయిర్ పోర్ట్  తరహాలో …మెట్రో స్టేషన్లను  తీర్చిద్దిద్దుతున్నారు  మెట్రో   అధికారులు.  ఇక కారిడార్స్  మధ్యలో  నిర్మిస్తున్న గార్డెనింగ్  అందరిని  ఆకట్టుకుంటోంది.

సిటీలో అందుబాటులోకి వచ్చిన మెట్రోను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలనే ఉద్దేశంతో పచ్చదనాన్ని పెంచుతున్నారు. స్టేషన్స్ దగ్గర రకరకాల మొక్కలు, ల్యాండ్ స్కేపింగ్ లాంటి గార్డెనింగ్ తో కార్పొరేట్ లుక్ సృష్టిస్తున్నారు. గ్రీన్ మెట్రో కాన్సెప్ట్ తో  హైద్రాబాద్ మెట్రో ఉండాలని అధికారులు ఇలా ప్లాన్ చేశారు. ఇక మెట్రో డివైడర్ల మధ్యలో పెంచుతున్న మొక్కలు… ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏపుగా పెరుగుతున్నాయి. పచ్చదనాన్ని పంచుతున్నాయి.

మెట్రో స్టేషన్స్ లో రకరకాల మొక్కలను నాటుతున్నారు. మెట్రో పిల్లర్ల చుట్టూ కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో కారిడార్స్ వెంట పాదచారులు నడిచేందుకు ఫుట్ పాత్ లు, స్టేషన్స్ దగ్గర కూర్చునేందుకు బేంచీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రో నడుస్తున్న ఏరియాల్లో.. స్మార్ట్ పార్కింగ్ కి ఇబ్బంది కాకుండా.. తీగ మొక్కలతో గ్రీనరీని పెంచనున్నారు.

మెట్రోకు కేటాయించిన స్థలాల్లో ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. డివైడర్ల మధ్య, మెట్రో స్టేషన్లలో నాటిన మొక్కలతో పాటు డిఫరెంట్ సీటింగ్ తో మెట్రో స్టేషన్స్ కార్పొరేట్ లుక్ లో కనిపిస్తున్నాయి. భాగ్యనగరానికి కొత్త అందాలను అద్దడానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ కేరాఫ్ గా నిలుస్తోంది. పెరుగుతున్న మోడ్రన్ కల్చర్ కు తగ్గట్టుగా మెట్రో ప్రాజెక్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది. మెట్రో కంఫర్టబుల్ జర్నీ తో పాటూ ఈ ప్రాజెక్ట్ లో ఎకో ప్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నారు. సిటీలో పెరుగుతున్న పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే పచ్చదనాన్ని ఇంకా పెంచాలంటున్నారు పర్యావరణ వేత్తలు.

 

Posted in Uncategorized

Latest Updates