క్లీన్ గంగా ఉద్యమకారుడు జీడీ అగర్వాల్ కన్నుమూత

గంగా నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ 111 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఫ్రొఫెసర్ జీడీ అగర్వాల్ కన్నుమూశారు. స్వామి జ్ణానస్వరూప్ సనంద్ జీగా పాపులర్ అయిన ఆయన హరిద్వార్ లో చనిపోయారు. ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఆయనను ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో గురువారం మధ్యాహ్నాం ఆయన కన్నుమూశారు. కాన్ఫూర్ ఐఐటీలో ఫ్రొఫెసర్ గా పనిచేసిన అగర్వాల్ కు పర్యావరణం అంటే ప్రాణం. గంగా నది పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న అన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులను వెంటనే పేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం ఈ ఏడాది జూన్ నుంచి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2012లో కూడా ఇదే తరహాలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దాదాపు రెండున్నర నెలల పాటు ఆయన దీక్ష చేయడంతో అప్పటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దిగివచ్చింది.

Posted in Uncategorized

Latest Updates