క్వారీలో భారీ పేలుడు..12 మంది కూలీలు మృతి

కర్నూలు జిల్లా హెత్తిబెళగల్ లోని కంకర క్వారీలో భారీ పేలుడు జరిగింది. రాత్రి జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కి చేరుకుంది. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడి …చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ఒడిషాకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు ధాటికి మూడు ట్రాక్టర్లు, ఒక లారీ,  రెండు షెడ్లు పూర్తిగా కాలిపోయాయి.

క్వారీలో జరిగిన పేలుడుపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. వంట చేసుకున్న సమయంలో నిప్పు రవ్వులు అక్కడే ఉన్న జిలిటెన్ స్టిక్స్ పై పడి పేలుడు జరిగిందని కొందరు చెబుతున్నారు. రాళ్లు పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని మరికొందరంటున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 300 మంది కార్మికుల వరకు అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు.. సీఎం చంద్రబాబు.  గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్వారీను సీజ్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రాంక్టర్ లైసెన్స్  రద్దు చేయాలని చెప్పారు. అటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి మారెప్ప.

Posted in Uncategorized

Latest Updates