క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు : ఇంజినీరింగ్ లో ఇంటర్న్‌షిప్‌ చేసి తీరాల్సిందే

engineering-college-uniforms-500x500ఇంజినీరింగ్‌ సిలబస్ లో ఇంటర్న్‌షిప్‌ చేయడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. విద్యార్థులు థర్డ్, ఫోర్త్ ఇయర్ లోతప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం కాలేజీలు – పరిశ్రమలతో అనుసంధానమై ఉండాలి. ప్రస్తుతం ఇది అమలు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో కేవలం నాలుగో వంతు కాలేజీల్లోనే ఇంటర్న్‌షిప్‌ అమలవుతోంది.  మిగతా వాటిలో రికార్డుల్లోనే ఉంటోంది. ఉన్నత విద్యామండలి అజమాయిషీ ఏమాత్రం లేకపోవడంతో కళాశాలల ఇష్టారాజ్యంగా మారింది. విద్యార్థులు సైతం ఇంటర్న్‌షిప్‌ చేశామని రికార్డులు సమర్పించి చేతులు దులుపుకొంటున్నారు.

ఈ విధానంలో మార్పు తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తేనే విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌ చేయకుండానే.. చేసినట్లు రికార్డులు సమర్పించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే కాలేజీ లైసెన్స్ రద్దు చేస్తారు .

భారీగా తగ్గిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌

రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్‌ కళాశాల్లో 2.74 లక్షల మంది చదువుతున్నారు. ఆటోమేషన్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్‌ కారణంగా ఉన్న ఉద్యోగాలు భారీ సంఖ్యలో కోతకు గురవుతున్నాయి. కొత్త ఉద్యోగాలకూ అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిని అందిపుచ్చుకోవడంలో విద్యార్థులు విఫలమవుతున్నారు. రెండేళ్లలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ భారీగా తగ్గాయి. ప్రముఖ కళాశాలల్లో ఒకేసారి వందల సంఖ్యల్లో నియామకాలు జరగగా.. ఇప్పుడు పదుల్లో కూడా జరగటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని వర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఇప్పటికే తప్పనిసరి ఉండగా.. దానిని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates