క్వాలిఫికేషన్ ఉండాల్సిందే : సర్పంచులకు టెన్త్ క్లాస్ మస్ట్

sarpanchసర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత SSC ( పదో తరగతి) ఉండాలని నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. సర్పంచ్ ఎంపికకు ఇప్పటి వరకు ఏలాంటి విద్యార్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతానికి పైగా 10వ తరగతి కూడా పూర్తి చేయని సర్పంచులే ఉన్నారు. అందులో ఎక్కువ మంది నిరక్షరాశ్యులే ఉన్నారు. వారి తరపున వారి కుటుంబ సభ్యులో, లేక ఇతరులో పంచాయతీల వ్యవహారాలు చూస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. దీంతో నిధులు దుర్వినియోగం అవ్వడమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు నివేదిక అందజేశారు.

వచ్చే మార్చి/ ఏప్రిల్ లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రతిపాదనలను అమలు చేయాలనే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. ఇప్పటీకే పంజాబ్, హర్యాన రాష్ట్రాల్లో సర్పంచ్ ఎన్నికలకు కనీస విద్యార్హత 10వ తరగతిని అమలు చేస్తున్నారు.

శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యులకు పోటీ చేయడానికి కనీస విద్యార్హత కూడా లేదు. ఎమ్మెల్యే, ఎంపీలకు పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన కూడా లేదు. కానీ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే సర్పంచ్ గా పోటీ చేయడానికి వీలులేదు.

Posted in Uncategorized

Latest Updates