క్వీన్ ఆఫ్ ఝాన్సీ.. ‘మణికర్ణిక’ టీజర్ అదిరింది

ముంబై : బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మణికర్ణిక’ సినిమా టీజర్ విడుదలైంది. తెలుగు దర్శకుడు జాగర్ల మూడి రాధాకృష్ణ దర్శకత్వంలో… బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ కంగన రనౌత్ ప్రధాన పాత్రలో… ఝాన్సీ రాణి జీవిత చరిత్రతో ఈ సిినిమా రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్భంగా ‘మణికర్ణిక’ టీజర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

ఝాన్సీ రాణిగా కంగన రనౌత్ శౌర్యం, పరాక్రమం, రాజసం, వీరోచిత నటన టీజర్ లో హైలైట్ గా నిలుస్తున్నాయి. బ్రిటీష్ వారితో యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట దృశ్యాలు… కళ్లు చెదిరేలా ఉన్నాయి. 1850నాటి రాజ్యాలు.. రాజ్యంలోని ఆనాటి వైభవం, రాజరికాన్ని కళ్లకు కట్టాడు డైరెక్టర్ క్రిష్. విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా ఈ సినిమా రూపొందుతోంది. వార్ సీన్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఆజాదీ, హర్ హర్ మహాదేవ్ అనే డైలాగులు దేశభక్తిని ఉప్పొంగించేలా ఉన్నాయి.

అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. బ్రిటీష్ పరిపాలనను ఎదిరిస్తూ జరిగిన మొదటి స్వతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి ప్రముఖ పాత్ర పోషించింది. ఆమె చూపిన తెగువ బ్రిటీష్ వారికి దడ పుట్టించింది. లక్షలాదిమంది భారతీయ యుద్ధవీరులను తయారుచేసింది. మణికర్ణిక… శక్తిమంతమైన యోధురాలిగా.. ఝాన్సీ రాణిగా మారి బ్రిటీషర్లను ఎదిరించిన వైనమే ఈ సినిమా కథాంశం.

జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న మణికర్ణిక సినిమాకు… బాహుబలి, భాగ్ మిల్కా భాగ్ సినిమా రచయితలు పనిచేశారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. మణికర్ణిక సినిమా.. 2019 జనవరి 25 విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

Posted in Uncategorized

Latest Updates