క్షణం క్షణం ఉత్కంఠ: నేడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మంగళవారం) వెలువడనున్నాయి. మొత్తం లక్షా 74 వేల ఈవీఎంల్లో నిక్షిప్తమైన 8,500 అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకే ప్రారంభం కానుంది. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిబందోబస్తును ఏర్పాటుచేశారు.

తెలంగాణ, రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, చత్తీస్‌‌‌‌గఢ్‌, మిజోరంలో జరిగిన ఎన్నికలకు ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌‌‌‌ ఓటింగ్‌‌‌‌ మిషన్లను 670 స్ట్రాంగ్‌‌‌‌ రూమ్స్‌‌‌‌లో భద్రపరిచారు. ఐదు రాష్ట్రాల్లో లక్షా 74 వేల 724 ఈవీఎంలను వినియోగించారు. ఒక్క మధ్యప్రదేశ్‌‌‌‌లో నే 65,367 అత్యధికంగా ఈవీఎంలను వాడారు. ఐదు రాష్ట్రాల్లో 8,500 మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌‌‌‌ నుంచి 2,907 మంది పోటీచేస్తున్నారు. పోలింగ్‌‌‌‌ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాం గ్ రూమ్స్‌‌‌‌లో భద్రపరిచారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌లో ఒక స్ట్రాంగ్‌‌‌‌ రూమ్‌‌‌‌ను ఏర్పాటుచేసినట్టు ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ వర్గాలు  చెప్పాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్‌‌‌‌ జరిగింది. రాజస్థాన్‌‌‌‌లో పోటీలో ఉన్న అభ్యర్థి ఒకరు చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు.అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో మాత్రమే స్ట్రాంగ్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ను తెరుస్తారు. మరోవైపు, ఈ ఐదు రాష్ట్రా ల అసెంబ్లీ ఫలితాలు వచ్చే ఏడాదిలో జరగబోయే లోక్‌‌‌‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, చత్తీస్‌‌‌‌గఢ్‌లో బీజేపీ, మిజోరంలో కాంగ్రెస్‌‌‌‌, తెలంగాణలో టీఆర్ఎస్‌‌‌‌ అధికారంలో ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌‌‌‌లో నాలుగోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. చత్తీస్‌‌‌‌గఢ్‌, రాజస్థాన్‌‌‌‌లోనూ మరోసారి అధికారం కైవసం చేసుకో వాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. 2014 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రా లు బీజేపీ విజయంలో కీలక పాత్రను పోషించాయి. ఇక్కడున్న 65 లోక్‌‌‌‌సభ సీట్లకుగాను 62 సీట్లను గెలుచుకుని బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి కూడా చావోరేవో లాంటివే. ఈసారి ఎలాగైనా ఈ మూడు రాష్ట్రా లను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా లోక్‌‌‌‌సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్‌‌‌‌ భావిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మిజోరంలో మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్‌‌‌‌సభ సీట్లున్నాయి.

Posted in Uncategorized

Latest Updates