క్షణాల్లోనే జరిగిపోయింది : ప్రాణం కంటే ఫోన్ ఎక్కువైందా తల్లీ

cellphone-drivingఫోన్.. చేతిలో ఇది ఉంటే చాలు చుట్టూ లోకం పట్టించుకోరు.. తలెత్తి కూడా చూడరు.. ముందూ వెనకా కూడా సోయ ఉండదు.. ఇక డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతుంటే మాత్రం జరగరాని ఘోరాలు ఎన్నో జరిగాయి. బోలెడు యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఇలాంటిది ఇప్పుడు ఓ ఘటన జరిగింది. విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

విజయలక్ష్మి (45) అనే మహిళ సోదరుడితో కలిసి బైక్ పై వెళుతుంది. వెనక కూర్చున్నది. ఈ సమయంలోనే ఫోన్ వచ్చింది. రన్నింగ్ లోనే మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతున్న సమయంలో.. ఫోన్ చేతి నుంచి జారిపోయింది. దాన్ని అందుకునే క్రమంలో.. బైక్ పై ఉన్నాను అన్న సంగతి మర్చిపోయింది. వేగంగా వెళ్తున్నాం అన్న విషయం గమనించకుండా ఫోన్ పట్టుకోవటానికి ఒక్కసారిగా కింద ఒంగింది. అంతే ఒక్కసారిగా బైక్ పైనుంచి రోడ్డున పడింది. కింద పడుతూనే ఆమె తల రోడ్డుకు తగిలింది. వెంటనే సృహ కోల్పోయింది. వెంటనే సోదరుడు ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

చేతి నుంచి జారిన ఫోన్ ను పట్టుకునే క్రమంలో పడిందని చెప్పాడు సోదరుడు. విజయలక్ష్మి మీ సేవ కేంద్రం కూడా నిర్వహిస్తున్నారు. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలో జరిగింది. డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదమో ఈ ఘటన నిదర్శనం అంటున్నారు పోలీసులు. అందుకే ట్రాఫిక్ రూల్స్ కు కఠినంగా అమలు చేస్తున్నాం అని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates