క్షణాల్లో కన్నుమూత : మొదటిసారే.. చివరి శ్వాస తీసింది

cardiac
40 ఏళ్లు సినీ రంగాన్ని తన అద్భుతమైన నటనతో ఏలిన శ్రీదేవి ఇక లేరు అని వార్త జీర్ణించుకోలేకపోతుంది ప్రపంచం. శ్రీదేవి చనిపోయింది అనే వార్త అబద్దం అయితే ఎంత బాగుండో అని అందరూ అనుకుంటున్నారు. 54 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో చనిపోవటాన్ని ఊహించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్న ఈ అతిలోకసుందరి.. ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అనేది అందర్నీ ఆవేదనకు గురి చేస్తున్న ప్రశ్న.

మేనల్లుడి పెళ్లి కోసం భర్త, కూతురితో కలిసి దుబాయ్ వెళ్లింది శ్రీదేవి. పెళ్లిలో అప్పటి వరకు చలాకీగా ఉన్న శ్రీదేవి.. ఫంక్షన్ అయిపోవటంతో హాటల్ గదిలోకి చేరుకున్నారు. భర్త, కూతురితో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సృహ కోల్పోయారు. ఎవరికీ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కుప్పకూలిన క్షణాల్లోనే ఆమెది చివరి శ్వాస అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు వైద్యులు. వారు చేయాల్సిన ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

తీవ్ర గుండెపోటు ఇలాగే వస్తుందని.. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారని చెబుతున్నారు వైద్యులు. మనం మన పనుల్లో బిజీగానే ఉంటాం.. అప్పటి వరకు బాగానే ఉంటాం.. ఆ సమయంలో సడెన్ గా గుండె ఆగిపోతుంది అంటున్నారు డాక్టర్లు. దీన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారని చెబుతున్నారు. శ్రీదేవికి కూడా ఇలాగే జరిగింది. తీవ్ర గుండెపోటు వచ్చింది. అది కూడా మొదటిసారి. ఇప్పటి వరకు గుండె సంబంధ వ్యాధులు లేవు. అయినా మొదటిసారి వచ్చిన గుండెపోటు తీవ్రంగా ఉండటంతో.. చివరి శ్వాసను తీసిందని అంటున్నారు. కళ్ల ముందు మనిషి చూస్తుండగానే కుప్పకూలిపోవటం, క్షణాల్లో చనిపోవటం కార్డియక్ అరెస్ట్ ద్వారా జరుగుతుంది అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates