క్షణికావేశంలో యువతి పై హత్యాయత్నం

 మాటల మధ్య వచ్చిన చిన్నపాటి పట్టింపు హత్యాయత్నం చేయడం వరకు వెళ్లింది. క్షణికావేశంలో ఓ యువకుడు అతని స్నేహితురాలిని హత్య చేయడానికి ప్రయత్నించాడు.  నాంపల్లిలోని గాంధీభవన్‌ వెనుక బస్తీలో నివసించే అహ్మద్‌ అలియాస్‌ షరీఫ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతీ రోజు వారిద్దరూ బస్తీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేవారు. గురువారం రాత్రి నాంపల్లిస్టేషన్‌ సమీపంలోని ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వద్ద సదరు యువతి, షరీఫ్ కూర్చుని ఉన్నారు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోపానికి గురైన షరీఫ్ బండరాయితో ఆమె తలపై గట్టిగా కొట్టి.. అక్కడి నుండి పారిపోయాడు. పరిస్థితిని గమనించిన స్థానికులు  యువతిని హాస్పిటల్ కు తరలించారు. పారిపోయిన షరీఫ్ భయానికి గురై బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు షరీఫ్ ను దగ్గర్లోని మరో హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షరీఫ్ పై ఇదివరకే హత్య, దోపిడీకి సంబంధించి రెండు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates