క్షమించాం పోండి : అక్రమ నివాసదారులకు UAE గుడ్ న్యూస్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దేశాలలో అక్రమంగా నివాసం ఉంటున్న వారికి గుడ్ న్యూస్. గల్ఫ్ దేశాల చట్టాలకు విరుద్దంగా వీసాలు లేకుండా పని చేస్తున్న వారిని తమ దేశాలకు వెళ్లి పోవడానికి UAE ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శనకాలను విడుదల చేసింది. కోర్టు కేసులు ఉంటే జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.

దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్ కైమా, అజ్మీర్, పూజీర,  ఉమాల్ క్వాయినిలో చట్ట విరుద్దంగా నివాసించే భారతీయులతో పాటు విదేశీయులకు  క్షమాబిక్ష  ప్రకటించింది యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్  ప్రభుత్వం. వీసాలు క్రమబద్దీకరించుకోవడానికి  ఆగష్టు 1 నుంచి మూడు నెలల గడువు ఇస్తూ అమ్నెస్టీ చట్టం తెచ్చింది. దీని ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా నివాసం ఉంటున్న వారు  తమ వీసాను క్రమబద్దీకరించడానికి 10 వేల రూపాయల జరిమాన చెల్లించాల్సి ఉంటుంది.  గల్ఫ్ దేశీయులు వీసా కోసం ఇచ్చే ఉద్యోగ  పత్రాల ఆధారంగానే వీసా క్రమ బద్దీకరణ చేయాలని రూల్స్ ప్రకటించారు.

వీసా గడువు ముగిసిన వారు నాలుగు వేలు చెల్లించి, బయోమాట్రిక్ వివరాలు సమర్పిస్తే సొంత దేశానికి వెళ్లడానికి ఎగ్జిట్ పత్రాన్ని అందిస్తుంది యుఏఈ ప్రభుత్వం. 10 రోజుల్లో యూఏఇ నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది. విమానం టికెట్ దొరకపోతే మరో ఐదు రోజులు అవకాశం ఇస్తారు. కంపెనీ వీసాలపై వచ్చి  బయట కంపెనీలలో పనులు చేసుకుంటూ బ్లాక్ లిస్టులో ఉన్నవాళ్లు మరో పది వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. యుఏఈలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వాళ్లు తప్పకుండా తమ దేశాలకు వెళ్లిపోవాలనే నిబంధన పెట్టారు. క్షమాభిక్ష ద్వారా తమ దేశాలకు వెళ్లిన వాళ్లు రెండేళ్లపాటు యూఏఈకి రావడం నిషేధం.

యూఏఈ ప్రభుత్వం అమ్నెస్టి చట్టం ద్వారా క్షేమాభిక్ష పెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ గల్ప్ వర్కర్స్ అసోషియేషన్. గల్ప్ దేశాలలో కూలీ పని చేసుకుని బతుకులు వెళ్ల తీసే కార్మికులకు స్వదేశం రావడానికి విమానం టిక్కెట్ ప్రభుత్వం కొనివ్వాలంటున్నారు.  స్వదేశం వచ్చిన తరువాత ఉపాధి భరోసా ఇవ్వాలన్నారు. వీసా సమస్యతో గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నవారికి తిరిగి సొంత దేశానికి వెళ్లడానికి మంచి అవకాశం అనుకుంటున్నారు కార్మికులు.

Posted in Uncategorized

Latest Updates