క్షుణ్ణంగా చర్చిద్దాం : మరో రెండు రోజులు అసెంబ్లీ

శాసనమండలి, అసెంబ్లీలో ఇవాళ కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లు-2018ను శాసనసభలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం మధ్యాహ్నం మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. దీంతో చట్టసభల్లో 2018-19 వార్షిక బడ్జెట్  కు ఆమోదం లభించినట్టవుతుంది.

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం లభించిన తర్వాత బడ్జెట్ లో కేటాయింపులకు అధికారిక ముద్ర లభిస్తుంది. ఇవాళ ప్రశ్న్రోత్తరాలు, జీరో అవర్ లు రద్దు చేశారు. అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందేవరకు శాసనమండలిలో చేనేత రుణాలు-హ్యాండ్లూమ్ రంగానికి సహాయం అనే ఆంశంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఇవాళ బీఏసీ మీటింగ్ జరగనుంది. ముఖ్యమైన పంచాయతీ రాజ్, మున్సిపల్ బిల్లు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుల ఆమోదం కోసం…. సమావేశాలను మరో రెండురోజులు పొడగించే అవకాశాలన్నాయి.

Posted in Uncategorized

Latest Updates