క్షేమంగా వస్తుంది : బీదర్ లో పసికందు ఆచూకీ లభ్యం

babyకోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో జూలై 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ అయిన పసికందు ఆచూకీ లభ్యం అయ్యింది. సీసీ కెమెరాల ఆధారంగా పసికందును ఎత్తుకెళ్లిన మహిళ బీదర్ వెళ్లినట్లు గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు బీదర్ వెళ్లాయి. అక్కడ బస్టాండ్, ఆటోవాలాలను విచారించారు. బస్ డ్రైవర్, కండెక్టర్ ఇచ్చిన ఆచూకీ ఆధారంగా ఆ మహిళ బీదర్ లో దిగిన ప్రాంతం నుంచి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. బీదర్ పోలీసుల సాయంతో అణువణువూ గాలింపు చేపట్టారు. కిడ్నాప్ చేసిన మహిళ ఆనవాళ్ల ఆధారంగా ఓ బస్తీలో ఉండొచ్చన్న సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు.

పోలీసులు అన్ని దారుల నుంచి ఎంక్వయిరీ మొదలుపెట్టటం, పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా వార్త రావటంతో కిడ్నాపర్లు అలర్ట్ అయ్యారు. పసికందును.. బీదర్ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఏడుస్తున్న పాపను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది విచారణ చేస్తే.. ఆస్పత్రిలో ఎవరికీ సంబంధం లేదని తేలిసింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హైదరాబాద్ నుంచి వెళ్లిన పోలీస్ టీంకి విషయాన్ని చేరవేశారు. వారు ఆస్పత్రి దగ్గరకు వచ్చి.. పాపను గుర్తించారు. హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన చిన్నారిగా నిర్ధారించారు. ఆ వెంటనే బీదర్ పోలీసులు.. హైదరాబాద్ పోలీసులకు ఆ పాపను అందించారు. మరికాసేపట్లో ఆ చిన్నారి హైదరాబాద్ బయలుదేరుతుంది. రాత్రికి తల్లి ఒడికి చేరనుంది.

Posted in Uncategorized

Latest Updates