ఖచ్చితంగా వాళ్ల పనే : కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఆఫీస్ పై దాడి

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆఫీస్ పై దాడి జరిగింది. తిరువనంతపురంలోని థరూర్ ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుండగులు. ఫ్లెక్సీలు చించేశారు. గేట్ పగలగొట్టారు. బీజేపీ కార్యకర్తలే ఈ పని చేసినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇండియా హిందూ పాకిస్థాన్ అవుతుందన్న శశి థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ గా ఉంది. ఈ సమయంలోనే థరూర్ ఆఫీస్ పై దాడి జరిగింది. దాడిని ఖండించిన శశి థరూర్… దాడులు చేయడం హిందూ సంస్కృతి కాదన్నారు. కొన్ని రోజులుగా థరూర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates