ఖతర్ లో అక్టోబర్ 19న బతుకమ్మ, దసరా వేడుకలు

ఖతర్ : అరబ్ దేశం ఖతర్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరుస్తోంది. ప్రతి ఏడాది లాగే.. అక్కడి తెలంగాణ ప్రాంత వాసులు మన సంబురాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ, తెలుగు సంస్కృతిని అరబ్ కంట్రీస్ లో.. గల్ఫ్ దేశాల్లో చాటిచెబుతున్నారు. ఈ ఏడు కూడా బతుకమ్మ, దసరా సంబురాలను స్థానికుల సహకారంతో నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి.

ఖతర్ లోని తెలంగాణ ప్రజా సమితి  బతుకమ్మ, దసరా సంబురాలు జరుపుతోంది. అక్టోబర్ 19, శుక్రవారం రోజున ‘అశోక హాలు – ఐసిసి – ఖతర్ ‘ లో   ‘దసరా- బతుకమ్మ ‘ సంబరాలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఖతర్ లోని తెలుగు, తెలంగాణ ప్రజలు.. తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో  రావాలని ఆహ్వానించారు. సాయంత్రం వేళ బతుకమ్మ, దసరా వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, తెలంగాణ జానపదాలు, పిల్లల నృత్య రూపకాలు, సరదా ఆటపాటలు, కోలాటాలు, దాండియా ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates