ఖాకీ మూవీ గుర్తుకొస్తుంది : చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

చేతిలో చెప్పులు ఒంటిపై ఆయిల్, చెట్ల పొదలే వాళ్ళ షెల్టర్…దీపావళి, సంక్రాంతి పండగలే టార్గెట్. రెక్కీ వేశారో ఇళ్ళు గుల్ల కావాల్సిందే. అదే చెడ్డీ గ్యాంగ్ స్పెషల్. మూడు కమిషనరేట్ పోలీస్ లకు సవాల్ విసిరి.. 28 దోపిడీలు చేసిన ఈ గ్యాంగ్ ఇప్పుడు రాచకొండ పోలీసులకు చిక్కింది.
కిషన్ బధియా, రామోజీ బధియా, భారత్ సింగ్. ఈ బ్యాచ్ తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మెంబర్స్. గుజరాత్ లోని దాహూడ్ జిల్లా సహద ఈ గ్యాంగ్ సొంతూరు. ఇందులో కిషన్ బధియాతో పాటు మరో మూడు ముఠాలు చెడ్డీ గ్యాంగులుగా అవతారమెత్తాయి. ఈ నాలుగు గ్యాంగ్స్ లో 15 మంది సభ్యుల వరకు ఉంటారు. వీళ్లంతా దేశవ్యాప్తంగా దోపిడీల కోసం టూర్లకు వెళ్తారు.

దీపావళి, సంక్రాంతి లాంటి వరుస సెలవులను టార్గెట్ చేసే ఈ ముఠా …పండగలకి 10 రోజుల ముందుగా ఎంచుకున్న సిటీలోకి ఎంటర్ అవుతాయి. ఇలా వచ్చిన తరువాత సిటీ శివార్లలోని అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏరియాలను సెలెక్ట్ చేసుకుంటారు. ముందుగా రెక్కీ వేసి.. తాళాలు ఉన్న ఇళ్లలో చోరీలకు ప్లాన్ చేస్తారు. అందుకోసం ఒంటిపై డ్రెస్ వేసుకోకుండా కేవలం చెడ్డీలపైనే ఇళ్ళను కొల్లగొడతారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఒంటి నిండా ఆయిల్ పూసుకుంటారు. ఒకవేళ ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేసినా వాళ్ళ చేతుల్లో నుంచి జారి పోయి రాళ్లతో దాడి
తెలుగు రాష్ట్రాల్లో 28 పైగా దోపిడీలు చేసిన ఈ గ్యాంగ్..సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 13 దోపిడీలు చేసింది. ఇలా మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠాగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన చెడ్డీ గ్యాంగ్..మీర్ పేట్, బీఎన్ రెడ్డి నగర్ లో చిక్కిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా రాచకొండ పోలీసులకు చిక్కింది. నిందితుల క్లూస్ తో గుజరాత్ సహదకి వెళ్లిన రాచకొండ SOT పోలీసులు..ఆరు నెలలు కష్టపడి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు.
మరో మూడు చెడ్డీ గ్యాంగులు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్స్ లోని నిందితుల కోసం కూడా గాలిస్తున్నామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates