ఖాళీ చేయలని యజమాని నోటీసులు : రూ.35 రెంటు కూడా కట్టని కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకే భంగం కలిగించే విషయం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  దేశాన్ని 60 ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్.. ఇప్పుడు నెలకు రూ.35 రెంటు కూడా కట్టలేని దుస్థితిలో ఉందట. రెంటు కట్టలేక అలహాబాద్‌ లోని పార్టీ ఆఫీస్‌ ను కోల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఆ కార్యాలయానికి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అద్దె కట్టకపోవడంతో అది కాస్తా ఇప్పుడు రూ.50 వేలకుపైనే అయింది. అలహాబాద్‌ లోని చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయంలోనే 8 దశాబ్దాలుగా కాంగ్రెస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేతలు పీడీ టాండన్, కమలా నెహ్రూ, ఇందిరాగాంధీ ఇదే కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. 3 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో పార్టీ ఆపీస్ ఉంది.

అంతటి ఘనత ఈ కార్యాలయానికి ఉంది. ఈ బిల్డింగ్ యజమాని రాజ్‌ కుమార్ సారస్వత్.. ఈ ఏడాది మొదట్లోనూ కార్యాలయం ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చారు. ఇటీవల మరోసారి బకాయిలు చెల్లించండి లేదా.. జులై చివరిలోపు ఖాళీ చేయండి అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే బకాయిలు చెల్లించాలని జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీ చీఫ్ రాజ్ బబ్బర్‌ కు లేఖలు రాశారు. బకాయిలు చెల్లించడానికి ఆఫీస్ బేరర్స్, ఇతర కారకర్తల నుంచి విరాళాలు సేకరించే పనిలో ఉన్నామని UPCC  ప్రతినిధి కిశోర్ వర్ష్‌ నె చెప్పారు. ఏడాదికి కోట్ల రూపాయలు ఖర్చు చేసే కాంగ్రెస్ పార్టీ నెలకు రూ.35 చెల్లించలేని పరిస్థితుల్లో ఉండటం బాధాకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

 

Posted in Uncategorized

Latest Updates