ఖైదీలే కాపరులు : జైళ్లే పశువుల శాలలు

cowఐడియా అదిరింది అంటున్నారు.. సూపర్బ్ ఆలోచన అంటున్నారు.. అవును.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 12 జైళ్లు (కారాగారాలు) పశువుల శాలలుగా మారుతున్నాయి. ఒక్కో జైల్లో 100 పశువులను ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖైదీలే ఆ పశువులకు కాపరులు. ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి నిధులు కూడా కేటాయించనున్నారు. ఖైదీలకు పశువుల పోషణ బాధ్యత అప్పగించటం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు.

యూపీలో పెద్ద ఎత్తున గో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుంది. ఈ క్రమంలోనే కొన్నింటి అమల్లోకి తీసుకొచ్చారు. వీటి పోషణ రోజురోజుకి భారంగా మారుతుండటంతో.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. జైళ్లలోని ఖైదీలకు ఈ బాధ్యత అప్పగిస్తే ఆదాయానికి ఆదాయం.. పని కూడా కల్పించినట్లు ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. జైల్లో ఖైదీలకు ఏదో ఒక పని కల్పించారు. అది పశువుల పోషణ అప్పగిస్తే బాగుంటుంది అంటున్నారు. దేశంలో రోజురోజుకి పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీన్ని పెంచటానికి కూడా ఇది ఉపయోగంగా కూడా ఉంటుంది అని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates