ఖైదీ అనుభవం కోసం : సంగారెడ్డి జైల్లో కేరళ కోటీశ్వరుడు

corodepathiసాధారణంగా డబ్బు ఉన్నవాళ్లు ఏం చేస్తారు..ఏ ఫారన్ టూర్ కో, తీర్థయాత్రలకో వెళ్లాలని కోరుకుంటారు. అయితే ఓ కోటీశ్వరుడు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతడు ప్రపంచ వ్యాపారస్తుల్లో దిగ్గజం. ఇంటర్నేషనల్ గోల్డ్ బిజినెస్ మెన్. ఉన్నట్టుండి అతడికి జైలులో చిప్పకూడు తినాలనిపించిందట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జైలు మ్యూజియంలో కేరళ రాష్ర్టానికి చెందిన బంగారం వ్యాపారి బాబీ చెమ్మనూర్ ఒక రోజు గడిపారు. రూ.500ఫీజు కట్టి, తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. తన ముగ్గురు మిత్రులు ఇంజినీర్ ఆసీన్‌అలీ, ట్రైనర్ ప్రశాంత్, దుబాయ్ జర్నలిస్టు బినయ్‌తో కలిసి జైలుకు వచ్చారు. రూ.2వేలు కట్టి, జైలులో ఉన్నారు.

సోమవారం (ఫిబ్రవరి-6) ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఖైదీల్లా ఉన్నారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ, తనకు 15ఏళ్లుగా జైలు జీవితం గడపాలనే కోరిక ఉండేదనీ, ఇక్కడి విషయాన్ని మీడియా కథనాలతో తెలుసుకొని వచ్చామని, తన చిరకాల వాంఛ తీరిందని ఆనందంగా చెప్పారు.  జైల్ మ్యూజియంకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతున్నదని, ఇప్పటి దాకా 49మంది జైలు జీవితం అనుభూతి పొందినట్లు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్ వెల్లడించారు. ఏది ఏమైనా శ్రీమంతులు తలుచుకుంటే సాధ్యంకానికి ఉండదు కదా అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates