ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర ప్రారంభం

11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడి శోభాయత్రకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . ఈ ఏడాది సప్త ముఖ కాలసర్ప మహాగణనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చిన గణేశుడు (ఆదివారం) మధ్యాహ్నం 11 గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. (శనివారం) అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ట్రాలీ వెల్డింగ్ పనులు నిర్వాహించారు. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు ట్రాలీపైకి గణేషుణ్ణి ఎక్కించారు. ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది.

మరోవైపు ఉపరాష్ర్టపతి హోదాలో తొలిసారి వెంకయ్యనాయుడు నిమజ్జనం కార్య్రకమంలో పాల్గొనేందుకు ఇవాళ (ఆదివారం) హైదరాబాద్ రానున్నారు. ఈసందర్భంగా ఆయన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్నారు.

శోభాయాత్ర జరిగే  ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. క్రేన్‌ నెంబర్‌-6 దగ్గర ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 481 మంది సూపర్‌వైజర్లు, 719 మంది SFAలు, 8,597 మంది కార్మికులను నియమించారు. నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు, 92 మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 101 వాటర్‌ క్యాంపుల ద్వారా 30 లక్షల వాటర్‌ ప్యాకెట్ల పంపిణీకి సిద్ధంగా ఉంచారు. వినాయక నిమజ్జనానికి భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates