గంగమ్మ ఉగ్రరూపం : వారణాసిలో నీట మునిగిన టెంపుల్

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిని వరదలు ముంచెత్తాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గంగమ్మ ఉగ్రరూపం దాల్చుతుంది. గంగాహారతి ఇచ్చే ఘాట్ తోపాటు.. టెంపుల్ నీట మునిగింది.గంగానదిలో ప్రస్ధుత నీటిమట్టం 65.78 మీటర్లుగా ఉంది. నదిలో బోటింగ్ ను అధికారులు నిషేధించారు. పదిరోజులుగా వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు స్థానికులు. విశ్వేశ్వర క్షేత్రంలో భారీగా వరదనీరు చేరటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. భారీ వరదల కారణంగా కాశీకొచ్చే పర్యాటకులు కొద్దిరోజులు ఆగాలని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారణాసిలో గంగానది ఉప్పొంగుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates