గంగా, జమున, తెహజీబ్ సంస్కృతికి నిలయం తెలంగాణ : కేసీఆర్

 

 

 

హైదరాబాద్ : గంగా, జమున, తెహజీబ్ సంస్కృతికి నిలయం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ డిన్నర్ కు ఆయన హాజరయ్యారు. క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందించారు. క్రిస్మస్, రంజాన్ అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కోర్ట్ వివాదంలో ఉన్న క్రిస్టియన్ భవన్ పూర్తికి కృషి చేస్తామని తెలిపారు. 15, 20 రోజుల్లో మత పెద్దలతో భేటీ అయి.. సమస్యలు పరిషరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates