గంటలో 2 వేల కిక్స్ : ఖమ్మం కానిస్టేబుల్ గిన్నిస్ రికార్డ్

GUNNISతెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ కు అరుదైన గౌరవం దక్కింది.  రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి  చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ గిన్నిస్ రికార్డుకెక్కాడు. మార్షల్‌ ఆర్ట్స్‌లో రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీ గంగారానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్.  TSSP  15వ బెటాలియన్‌ కు చెందిన సంజీవ్‌ కుమార్‌.. గత ఏడాది ఏప్రిల్‌ 30న మధురైలో జరిగిన తైక్వాండోలో లార్జెస్ట్‌ తైక్వాండో డిస్‌ ప్లే పూమోస్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ఈ ఏడాది జనవరి 26న హైదరాబాద్‌లో గంటలో 2 వేల27 కిక్స్‌ చేసి మరొక గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను గిన్నిస్ బుక్ అధికారుల చేత అందుకున్నారు. ఈ సందర్భంగా సంజీవ్‌ కుమార్‌ ను బెటాలియన్‌ కమాండెంట్‌ రాంప్రకాష్‌ అభినందించారు.

Posted in Uncategorized

Latest Updates