గంట మోగుతోంది : మొజంజాహీ క్లాక్ టవర్ కు పూర్వ వైభవం

CLOCK TOWER CITYహైదరాబాద్ కోఠీ ప్రాంతంలోని మొజంజాహీ మార్కెట్ క్లాక్ టవర్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చారు GHMC అధికారులు. క్లాక్ టవర్ చుట్టూ ఉన్న నాలుగు గడియారాలు పని చేస్తున్నాయి. గంట గంటకు ఠంగ్, ఠంగ్ మంటూ సమయాన్ని చెప్పేస్తుండటంతో ఆ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉన్న ఈ క్లాక్ టవర్ పై దృష్టి సారించారు అధికారులు. క్లాక్ టవర్ లో కొత్త గడియారాలను అమర్చి, చుట్టు లైట్లను ఏర్పరిచారు. దీంతో రాత్రి సమయాల్లోనూ టైమ్ చూసుకోవడానికి వీలుంది.

బ్రిటీష్‌ కాలంలో గడియారాలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో సమయం తెలుసుకునేందుకు ఇలా క్లాక్‌ టవర్లను ఏర్పాటు చేసేవారు. ఇలాగే మొజంజాహీ మార్కెట్‌ లోనూ ఎత్తైన గోపురం నిర్మించి నాలుగు వైపుల గడియారాలను అమర్చారు. ఇది ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడేది.

హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యాక నగరం నడిబొడ్డున ఉన్న మొజంజాహీ మార్కెట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధీనంలో వచ్చింది. అనంతరం కొన్నేళ్ల వరకు మార్కెట్‌ క్లాక్‌ టవర్‌లోని గడియారం పని చేసిందని, అయితే నిర్వహణ లేకపోవడంతో తరువాత ఆగిపోయింది. దీంతో ఇన్నాళ్లకు మళ్లీ గడియారం పని చేయడంతో.. అప్పటి స్వీట్ మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ సంతోషంవ్యక్తం చేస్తున్నారు స్ధానికులు.

Posted in Uncategorized

Latest Updates