గండిపేట చెరువులో వరుణ యాగం

వర్షాల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. సకాలంలో వర్షాలులేక నాటిన మొక్కలు ఎండిపోవడంతో అన్నదాతలు బిందెలతో మొక్కలకు నీరు పోయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వరుణదేవా కరుణించావా అంటూ పూజలు చేస్తున్నారు.

వారి సంప్రదాయ పద్ధతుల్లో మొక్కుతున్నారు. కొందరు కప్పలకు పెళ్లిళ్లు చేయగా..మరికొన్ని చోట్ల ఆలయాల్లోని విగ్రహాలు నీటితో అభిషేకాలు చేస్తున్నారు. అన్నదాతలనే కాకుండా సిటీ ప్రజలూ వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు గురువారం ( ఆగస్టు-2) గండిపేట చెరువులో వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి లోకకల్యాణం జరగాలని కోరుతూ.. ఆలయం సమీపంలో ఉన్న గండిపేట చెరువులోకి దిగి వేదమంత్రాలతో పూజలు చేశారు.

ప్రతీ సంవత్సరం వరుణయాగం నిర్వహించిన అనంతరం చెరువు నిండి భాగ్యనగర వాసులకు నీళ్ల కొరత తీరుతుందన్నారు పూజారులు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వచ్చి చెరువు ఒడ్డున నిల్చొని కార్యక్రమం తిలకించారు. వర్షాల పడి పంటలు బాగా పండాలని..సిటీవాసులకు నీటి కొరత ఉండకూడదని కోరుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates