గజగజ వణికిపోయారు : బీచ్ లోకి దూసుకొచ్చిన శరణార్ధులు

స్పెయిన్ లోని ఓ బీచ్ లోకి 30 మంది అక్రమ వలసదారులు దూసుకొచ్చారు. చెల్లాచెదురుగా అందరూ బీచ్ దగ్గర పరుగులు పుడుతుండటంతో… బీచ్ దగ్గర సన్ బాత్ ఎంజాయ్ చేస్తున్న ప్రజలు, అక్కడ ఉన్న టూరిస్టులు భయంతో కేకలు పెట్టారు. ఏం జరుగుతుందో అర్ధంకాక షాక్ అయ్యారు. శుక్రవారం స్పెయిన్ లోని టారిఫా బీచ్ లో ఈ ఘటన జరిగింది.
మొరాకో దేశానికి చెందిన దాదాపు 30 మంది శరణార్థులు ఒక పడవలో జిబ్రాల్టర్‌ జల సంధిని దాటి స్పెయిన్‌ జలాల్లోకి ప్రవేశించారు. దీన్ని గమనించిన స్పెయిన్ కోస్ట్ గార్డ్ షిప్ వారిని వెంబడించింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టారిఫా బీచ్ దగ్గర్లోకి చేరుకున్నారు. దీంతో బీచ్ దగ్గరకు పడవ వచ్చే సమయంలోనే…. ఒక్కసారిగా లైఫ్ జాకెట్లను విసిరిపడేస్తూ పడవలో నుంచి దూకి చెల్లాచెదురుగా పరుగెత్తసాగారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక బీచ్ లో సన్ బాత్ ఎంజాయ్ చేస్తున్నవారు, ఒడ్డున ఉన్న ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. 30 మంది శరణార్ధులలో ఎక్కువమంది యువకులే ఉన్నారు. కొంతకాలంగా శరణార్ధులకు స్పెయిన్ డెస్టినేషన్ గా మారిపోయింది. అధికసంఖ్యలో శరణార్ధులు సముద్రమార్గాల ద్వారా స్పెయిన్ లోకి ప్రవేశిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates