గజరాజా ఊపిరిపీల్చుకో… మహానదిలో రెస్క్యూ ఆపరేషన్

కటక్ : గజరాజులు ఊపిరి పీల్చుకున్నాయి. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో జరిగిన సంఘటనలో… ఏనుగులకు ప్రాణం పోశారు స్థానికులు. ఇటీవల భారీ వర్షాల కారణంగా… మహానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది దాటేందుకు ఓ ఏనుగుల మంద ప్రయత్నించింది. ఆ మందలో 20 పైగా ఏనుగులున్నట్టు తెలిసింది. అందులో… ఓ ఐదు ఏనుగులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

ముందలి ఏరియా నుంచి నారాజ్ బ్యారేజీ వైపు కొట్టుకువచ్చాయి ఏనుగులు. గజ రాజులు వరదలో చిక్కుకుపోవడం తెల్సుకున్న ఫారెస్ట్ డిపార్టుమెంట్…  రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.  ఐదు కిలోమీటర్ల పాటు ఏనుగులను వరద ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత.. స్థానికుల సహాయంతో… మూడు ఏనుగులను రక్షించారు అటవీ సిబ్బంది. మిగతా రెండు ఏనుగులు కూడా  ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఏనుగులు వరదలో చిక్కుకుపోవడంతో.. తీరం వెంబడి గ్రామస్తులు అంతా టెన్షన్ పడ్డారు. అంతా కలిసి వాటిని కాపాడారు.

Posted in Uncategorized

Latest Updates