గజ్వేల్ నుంచి కేసీఆర్ భారీ విజయం

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గెలుపొందారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్… ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు. 19వేల 366 ఓట్ల తేడాతో 2014లో నెగ్గిన కేసీఆర్.. ఈసారి యాభై వేల పైచిలుకు ఓట్లతో విజయదుందుభి మోగించారు.

ఎమ్మెల్యేగా 8వ సారి కేసీఆర్ విజయం

ఇంతకుముందు వరకు 7సార్లు ఎమ్మెల్యేగా… 4సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. గజ్వేల్ నుంచి తాజాగా కేసీఆర్ దక్కించుకున్న విజయం ఎమ్మెల్యేగా ఆయనకు 8వది. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కేసీఆర్ ఆ తర్వాత ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు.

 

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates