గజ్వేల్ నుంచి బరిలో దిగుతా : గద్దర్

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి తాను బరిలో దిగుతానని చెప్పారు ప్రజా కవి గద్దర్. ఇక్కడినుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో దిగుతుండటంతో… గద్దర్ కామెంట్లపై ఆసక్తి పెరిగింది. సిద్ధిపేట తన సొంత జిల్లా అని.. సొంత నియోజకవర్గం కాబట్టే తాను గజ్వేల్ నుంచి పోటీలో నిలబడాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. తూప్రాన్ లో తనకు ఓటు హక్కు ఉందని హైదరాబాద్ లో చెప్పారు గద్దర్.

సెక్రటేరియట్ లో  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఓ వినతి పత్రం ఇచ్చారు గద్దరు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని… గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తనకు రక్షణ కల్పించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తనకు గైడ్ గా ఉండి.. సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు.

మీడియాతో మాట్లాడిన గద్దర్… ఇప్పటికే గజ్వేల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారిని పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతానని అన్నారు. ప్రతిపక్షాల తరఫున తాను ఒక్కడిని బరిలో దిగేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.

తాను ఒక గాయపడ్డ ప్రజల పాటను అని చెప్పారు గద్దర్. ఎన్నికలు, ఓట్లపై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు ఊరూరా.. వాడవాడలా తిరగాలనుకుంటున్నానని.. అనుమతి ఇచ్చి గైడ్ గా ఉండగలరని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రధానాధికారికి ఇచ్చిన వినతిపత్రం కింద చూడొచ్చు.

 

Posted in Uncategorized

Latest Updates