గజ్వేల్ లో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్

నాలుగో విడత హరితహారాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. తుర్కపల్లి, ములుగులో మొక్కలు నాటారు. ఆ తర్వాత గజ్వేల్ లో మొక్క నాటారు. సీఎం మొక్క నాటిన తర్వాత సైరన్ మోగించారు. ఆ తర్వాత గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, అన్ని రోడ్ల వెంట, ఔటర్ రింగ్ రోడ్డుపైనా, ప్రభుత్వ-ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. గజ్వేల్ లో మొక్క నాటిన తర్వాత.. ప్రజ్ఞాపూర్ లోనూ మొక్క నాటారు ముఖ్యమంత్రి.  తుర్కపల్లి, ములుగులో కూడా మొక్కలు నాటారు.

ప్రజ్ణాపూర్ లో ఎంతో కాలంగా నర్సరీ నిర్వహిస్తూ.. మొక్కలను పంపిణీ చేస్తున్న వారిని అభినందించారు. వారితో కలిసి ఫొటో దిగారు. వీధుల్లో మొక్కలు నాటుతున్న స్థానికుల దగ్గరకు వెళ్లి పరిశీలించారు.


Posted in Uncategorized

Latest Updates