గజ తుఫాన్ బాధితులకు ఆది పినిశెట్టి సాయం


గజ తుఫాన్ తమిళనాడును జలమయం చేసేసింది. బాదితులను ఆదుకునేందుకు ప్రముఖులు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలను ప్రకటించారు.

ఇందులో భాగంగా హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు అందించారు. 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాదు…ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, వారిని ఆదుకోవాలని కోరారు ఆది పినిశెట్టి.

 

 

Posted in Uncategorized

Latest Updates