గట్టిపిండం : పూడ్చి పెట్టిన 8 గంటల తర్వాత బతికింది

babyచనిపోయిందనుకున్న పాపను పూడ్చిపెట్టిన 8 గంటల తర్వాత ఏడ్చిన అరుదైన ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. పుట్టుకతోనే మరణించిందనకున్న పాప పూడ్చిపెట్టిన ఎనిమిది గంటల తర్వాత ప్రాణాలతో బయటపడింది. జన్మించినప్పుడే బేబీ మరణించిందని అనుకుని పూడ్చిపెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కొద్దిగంటల అనంతరం అటుగా వెళ్తున్న పోలీసులకు ఏడుపు వినిపించింది. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న వారు టార్చ్‌ లైట్‌ వెలుతురులో బేబీని మట్టిలో నుంచి బయటకు తీశారు. వెంటనే శ్వాస ఆడేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు డాక్టర్లు. ఇలాంటి సంఘటనలు జరగటం చాలా అరుదని, శ్వాస ఆడకపోవడంతో కుటుంబసభ్యులు చిన్నారి చనిపోయిందనుకున్నారని తెలిపారు. చిన్నారి క్షేమంగా ఉండటంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవదులులేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates