గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

gattuగట్టు ఎత్తిపోతల పథకానికి ఇవాళ(శుక్రవారం) శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. రూ. 553.98 కోట్ల అంచనా వ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు పెంచికలపాడు మండలం గట్టులో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం.  ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ల‌క్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ భూములన్ని సస్యశ్యామలం చేసేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

అంతకు ముందు  కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అధికారులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పనుల పనితీరును సీఎంకు వివరించారు. తుంగభద్ర నుంచి అప్రోచ్ కెనాల్ ప్రారంభమయ్యే ప్రాంతాన్ని మార్చాలని సీఎం అధికారులకు సూచించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates