గడువులోగా పంచాయతీ ఎన్నికలు : జూపల్లి

jupalliగడువులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికైన వారికి కొత్త చట్టంపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వ పరంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదన్నారు.

బీసీలకు 34, ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం బీసీ జనగణన పూర్తయ్యిందన్నారు. ఈనెల 25లోపు పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. మహిళలకు లాటరీ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు కేటాయిస్తామన్నారు మంత్రి జూపల్లి.

Posted in Uncategorized

Latest Updates