గడువు ముగిసిన విదేశీ కార్మికులకు UAE క్షమాభిక్ష

గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులతో పాటు విదేశీ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం…లేదంటే ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే అవకాశముంది.UAE అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది  భారతీయ వసలదారులున్నారు.

ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15-20% ఉన్నారు. ఇందులో 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా ఉన్నారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని UAE గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు… వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

బుధవారం(ఆగస్టు-1) ముగ్గురు భారతీయులు అబుదాబిలోని BLS ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. మొదటి రోజు కావడంతో సంఖ్య తక్కువగా ఉందని… రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. UAE లో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates