గడువు ముగిస్తే అమెరికా నుంచి తిరుగు ప్రయాణమే…

చట్టపరమైన గడువు ముగిసినా తమ దేశంలోనే ఉంటున్న విదేశీయులను తిరిగి వారి దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది అమెరికా. ఇందుకు వీలు కల్పించే కొత్త నిబంధనను అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనుంది. దీని ప్రకారం వీసా స్థితి మార్పు, పొడగింపు వంటి అభ్యర్థనలు తిరస్కరణకు గురికావడంతో అమెరికాలో ఉండే గడువు తీరిపోతుంది. వారిని దేశం నుంచి బయటకు పంపిస్తారు. అయితే ఈ నిబంధన నుంచి ప్రస్తుతానికి హెచ్‌-1బీ లాంటి ఉద్యోగ సంబంధ  వీసాల వారికి, కారుణ్య అభ్యర్థనలు చేసుకున్నవారికి మినహాయింపును లభిస్తుంది. గత కొన్ని నెలలుగా హెచ్‌-1బీ వీసాదారుల వీసా పొడగింపు దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. వారికి కూడా ఈ నిబంధనను వర్తింపజేస్తే.. చాలా మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం పడేది. వచ్చే సోమవారం(అక్టోబర్‌ 1)  నుంచి కొత్త నిబంధన అమలవుతుందని.. గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారికి వలసల న్యాయమూర్తి ముందు హాజరు కావాలని నోటీసు (ఎన్‌టీఏ)లు పంపుతామన్నారు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) అధికారులు.

Posted in Uncategorized

Latest Updates