గడ్కరీతో హరీష్ : కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని.. కేంద్ర మంత్రి గడ్కరీని కోరామని చెప్పారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. కేంద్రం నుంచి నిధులు ఇచ్చి.. ప్రాజెక్టు మరింత త్వరగా పూర్తి చేసేందుకు సహాయం చేయాలని కోరామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న హరీష్..మంగళవారం (జూలై-17) కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. గడ్కరీ సహకారంతోనే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తున్నామన్నారు హరీష్. అన్ని అనుమతులు వచ్చేందుకు సహకరించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates