గడ్డం తీసేసే టైమొచ్చింది : ఉత్తమ్

ప్రజాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో సమావేశం అయ్యారు. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా మాట్లాడిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 తెలంగాణ శాసన సభ ఎన్నికల లెక్కింపు కోసం ఎదురు చేస్తున్నామన్నారు. “పోలింగ్ లో పాల్గొన్న అందరికీ పీపుల్స్ ఫ్రంట్ తరపున ధన్యవాదాలు. ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. 75 నుంటి 80సీట్లతో పీపుల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. పోలింగ్ నిర్వహించడంలో.. ఎన్నికల కమిషన్ ఫెయిలైంది. సీఈఓ క్షమాపణ కోరడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఓటర్ స్లిప్ లో తప్పులున్నాయని ముందునుంచీ చెబుతూనే ఉన్నాం. ఈవీఎంల ట్యాoపరింగ్ విషయంలో కూటమి కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన తరువాత ఎవరు అక్కడకి వెళ్లకూడదు. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర అన్ని పార్టీ ల  కార్యకర్తలకు అనుమతి ఇవ్వాలి” అన డిమాండ్ చేశారు. “KCR, KTR 100 నుండి 80కి వచ్చారు.11 వ తేదీన 30 సీట్లు అంటారు. మా ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి అని ఇండియా టుడే సీఈఓ రాజ్ దీప్ సర్దే శాయ్ చెప్పారు. కేసీఆర్ పాలనపై జనం ఆగ్రహంగా ఉన్నారు. అందరం కలిసి కూటమిగా వెళ్లడం కలిసొచ్చింది. పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళు మాకే ఓటేయండి. గడ్డం తీసేసే టైమ్ వచ్చింది. డిసెంబర్ 11 తర్వాత చూద్దాం” అన్నారు ఉత్తమ్ రెడ్డి.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు L. రమణ మాట్లాడుతూ.. “ప్రజల గొంతుకగా ఉండడం కోసమే కూటమిగా ఏర్పడ్డాం. కనీస ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. రాజ్యాంగ బద్ధమైన కన్వీనర్ పదవిలో కోదండరాం ఉంటారు. 86 సంఘాలు జేఏసీగా ఏర్పడి కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నాయి” అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా కూటమిని గెలిపిస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కూటమికి సైలెంట్ ఓట్ పడిందన్నారు. డబ్బుకు లొంగకుండా జనం ఓటేశారని తెలంగాణ జన సమితి నేత విద్యాధర్ రెడ్డి అన్నారు. నియంతృత్వ పాలనకు తెర పడుతోందని ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates