గణేశ్ నిమజ్జనంలో డాన్స్ చేస్తూ.. యువకుడు మృతి

హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడు మద్యం తాగి డాన్స్ చేస్తూ స్పృహ తప్పాడు. కొద్దిగా తేరుకున్న అనంతరం ఛాతిలో నొప్పి అంటూ విలవిల్లాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. నగరంలోని బోరబండ పెద్దమ్మకు చెందిన సతీష్ (26) అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వారి బస్తీలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జనంలో ఊరేగింపులో పాల్గొన్నాడు. మద్యం తాగుతూ స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి తేరుకున్న సతీష్ ఛాతిలో నొప్పి అంటూ మరోసారి కుప్పకూలిపోయాడు. సతీష్‌ ను లేపేందుకు తల్లి ప్రయత్నించినప్పటికీ లేవలేదు. వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానికంగా ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates