గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు

గణనాథుడి నిమజ్జనానికి హైదరాబాద్‌ మహానగరం సిద్ధమైంది. నగరంలోని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ సహా 35 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 10 నిమజ్జన కేంద్రాలు, 51 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌ గణేషుడు వెళ్లే రూట్‌లో పోలీసులు ట్రాఫిక్‌ నిలిపివేశారు.

వినాయక నిమజ్జనానికి హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. నగరంలో 65వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ఫోర్స్‌, షీటీమ్స్‌ సిటీ ఆర్మ్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌తో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌, ఇతర చెరువుల దగ్గర కొత్తగా 450 ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా 350 సీసీ కెమెరాలు, రాచకొండ పరిధిలో కొత్తగా 160 కెమెరాలు ఏర్పాటు చేశారు. 31 జిల్లాల్లో పర్యవేక్షణకు పోలీసులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 74,809 విగ్రహాలకు జియోట్యాగింగ్‌ ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates