గతంలో ఎర్రజోన్న రైతులను కాంగ్రెస్ పట్టించుకోలేదు : జీవన్ రెడ్డి

636543840384326651గతంలో ఎర్రజొన్న రైతుల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి-16) మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రజొన్నలకు రూ.రెండు వేల మూడు వందలు మద్దతుధర ప్రకటించిన కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం (ఫిబ్రవరి-19)నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయన్నారు. రైతులను కాంగ్రెస్‌ నేత సురేష్ రెడ్డి రెచ్చగొడుతున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రైతులపై కేసులు పెట్టారు.. బుల్లెట్లు దించారని విమర్శించారు. TRS అధికారంలోకి వచ్చాక ఆ కేసులు ఎత్తివేసిందన్నారు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates