గతంలో కంటే 4 శాతం ఎక్కువ.. ఈసారి 73.2 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ ఓటరు చైతన్యం చూపించాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో భారీసంఖ్యలో పోలింగ్ శాతం నమోదైంది. ఒకరోజు ఆలస్యంగా ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గాల వారీగా పూర్తిస్థాయి పోలింగ్ గణాంకాలను ప్రకటించారు. 2014లో 69శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకు నాలుగు శాతం ఎక్కువగా 73.20 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు.

తెలంగాణ ఎన్నికల ఓవరాల్ పోలింగ్ 73.2 %

పురుషుల ఓటింగ్ 72.54%,

స్త్రీల ఓటింగ్ 73.88%

ట్రాన్స్ జెండర్ల ఓటింగ్ 8.99%

ప్రజలు బాధ్యతతో ఇంత భారీగా వచ్చి ఎంతో సహనంతో వేచి ఉండి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లకు రజత్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates