గత ఆదాయాన్ని దాటిన మేడారం హుండీ లెక్కింపు

medaramhundiమేడారం సమ్మక్క-సారక్క మహాజాతర హుండీ లెక్కింపు కొనసాగుతుంది. గత నాలుగు రోజులుగా హుండీల లెక్కింపు కొనసాగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపంలో హుండీల లెక్కింపును చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగోరోజు 109 హుండీల లెక్కింపు ద్వారా రూ. 1.70 కోట్లు ఆదాయం సమకూరింది. ఇప్పటివరకు 399 హుండీల లెక్కింపును పూర్తిచేయగా ఆదాయం రూ. 9.06 కోట్లుగా తేలింది. ఇది గత మేడారం జాతరలో వచ్చిన రూ. 8 కోట్ల 91 లక్షల మార్క్‌ను శుక్రవారం (ఫిబ్రవరి-9)న దాటినట్లు డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు తెలిపారు. పూర్తి వివరాలు మొత్తం కౌంటింగ్ లో తేలుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates