గద్దర్ సంచలన ప్రకటన : ఎన్నికల్లో పోటీ చేస్తా

ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తోందని, ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆదివారం (జూలై-15) జరిగిన BFL సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాట్లు తెలిపారు. దేశం మొత్తం లాల్‌ నీల్ ఐక్యతపై చర్చ జరుగుతోందని, లాల్‌ నీల్ ఐక్యత చూస్తే తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తోందన్నారు.

తనకు ఇప్పటి వరకు ఓటు హక్కు లేదని, ఇప్పుడు నమోదు చేసుకుంటానని చెప్పారు గద్దర్. కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చిన గద్దర్.. లాల్‌ నీల్ జెండాలతో నూతన పార్లమెంట్ తీసుకురావాల్సి ఉందన్నారు. అంబేద్కర్ విధానం పేరుతో ప్రజలను BJP మభ్యపెడుతోందని విమర్శించారు. లాల్‌ నీల్ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమన్నారు గద్దర్.

Posted in Uncategorized

Latest Updates