గనుల రంగానికి ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

ktr
ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు మంత్రి కేటీఆర్‌. బుధవారం(ఫిబ్రవరి-14) హైదరాబాద్ లోని HICCలో అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు దేశ విదేశాల నుంచి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ… ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో గ్రానైట్‌ పరిశ్రమ వృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గనులరంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి కేటీఆర్. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని..గనుల్లో కార్మికుల రక్షణకు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates