గన్ చూపించి… దంపతులను భయపెట్టిన మాజీ ఎంపీ కొడుకు

తనకు దారి ఇవ్వలేదనే కోపంతో దంపతులపై తుపాకీ చూపిస్తూ బెదిరింపులకు దిగాడు బీఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ పాండే కొడుకు అశిష్‌ పాండే. ఢిల్లీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ఘటన జరిగింది.

అశిష్‌ పాండే ఆదివారం సౌత్ ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కి వెళ్లాడు. కారు పార్కింగ్‌ చేసే సమయంలో తనకు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ జంటతో గొడవకు దిగాడు. అయితే వారు కూడా ప్రతిఘటించడంతో ఆశిష్‌  పట్టలేని కోపంతో ఊగిపోయాడు. అడ్డుతప్పుకోకపోతే కాల్చిపడేస్తానంటూ తన దగ్గర ఉన్న తుపాకీతో వారిని బెదిరించాడు. ఈ సమయంలో ఆశిష్‌ పక్కనే ఉన్న యువతి, సెక్యూరిటీ గార్డు ఆపేందుకు ప్రయత్నించినా అతడిని అదుపు చేయలేకపోయారు. హోటల్‌ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించినప్పటికీ అతడు దురుసుగా ప్రవర్తించాడు. అయితే.. ఆశిష్‌ మహిళల వాష్‌ రూంలోకి వస్తూంటే తాను అడ్డుకున్నందు వల్లే ఇలా ప్రవర్తించాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆశిష్‌ పై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates