గన్ మెన్ కాల్పుల ఘటన : జడ్జి కొడుకుకి బ్రెయిన్ డెడ్

హర్యానా : ఈ శనివారం (అక్టోబర్-13)న హర్యానాలోని గురుగ్రామ్ లో జడ్జి కృషన్ కాంత్, అతడి భార్య..కుమారుడిపై గన్ మెన్ కాల్పులు జరిపిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డవారిలో జడ్జి భార్య రితూ(45) ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. నిన్న (అక్టోబర్-14)న మరణించింది. ఈ విషాదం మరవకముందే..జడ్జి కుమారుడు ధ్రువ్(18)కి బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు డాక్టర్లు.

ధ్రువ్‌ కు తలలో తూటా దిగిందని.. దీంతో అతడికి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని ఇవాళ (అక్టోబర్-15) వెల్లడించారు డాక్టర్లు. ప్రస్తుతం అతడిని ICUలో ఉంచినట్లు చెప్పిన డాక్టర్లు..అతడు కోలుకుంటే అద్భుతం జరిగినట్టేనని తెలిపారు. కృషన్‌ కాంత్‌ గురుగ్రామ్‌లో అదనపు సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగంలో ఉన్న మహిపాల్‌ రెండేళ్లుగా కృషన్‌ కు గార్డుగా పనిచేస్తున్నాడు. జడ్జి తనకు సెలవు ఇవ్వట్లేదన్న కోపంతో నిందితుడు ఆయన భార్య, కొడుకు షాపింగ్‌ వెళ్లినప్పుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. గురుగ్రామ్‌ కోర్టు అతడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

 

 

Posted in Uncategorized

Latest Updates