గరుడ బస్సులో పైరసీ  : కేటీఆర్ ఆగ్రహం

krishnarjunaతెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాల ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఆర్టీసీ సిబ్బంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఆయన. యువ కథానాయకుడు నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించారు. ఈ విషయంపై సునీల్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సులో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ టీవీ స్క్రీన్‌షాట్‌ను కేటీఆర్‌కు పంపించాడు. ప్రభుత్వ సంస్థల్లోనే ఇలాంటి పైరసీ జరిగితే.. ఇక పైరసీ నియంత్రించాలని సామ్యానుడిని ఎలా అడుగుతారని ప్రశ్నించాడు. సునీల్ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్… ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీకి సూచించారు.

Posted in Uncategorized

Latest Updates