గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన: కోమటిరెడ్డి, సంపత్

 

komati

హైకోర్టు తీర్పునకు అనుకూలంగా తమకు గన్ మెన్లను కేటాయించాలన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌. డీజీపీ మహేందర్‌రెడ్డితో తో సమావేశమైన  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు తమకు గన్ మెన్లను కేటాయించాలని కోరారు. తాము ఎమ్మెల్యేలుగా కొనసాగేలా హైకోర్టు తీర్పు నిచ్చిందన్నారు. కోర్టు తీర్పును అమలు పర్చాలని..ఎమ్మెల్యే లకు కల్పించే సదుపాయాలు తమకు కల్పించాలన్నారు. తమను అణిచివేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.

కోర్టు అనుకూల తీర్పుతో తమ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటే వారిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని…  పెట్టిన కేసులను రెండు రోజుల్లో ఎత్తివేయాలని… లేదంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ప్రజాబలం కూడా లేని కొందరు టీఆర్ఎస్ నాయకులకు గన్ మెన్లను ఇచ్చారని ఆరోపించారు. కోర్టు తీర్పునకు అనుగుణం తమకు గన్ మెన్లను కేటాయించాలని…లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు  ఆ నేతలు.

Posted in Uncategorized

Latest Updates